16 June, 2026 | 2:46 AM

ఎన్నికలప్పుడే నాకు రాజకీయాలు

16-06-2026 01:50 AM

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక, జూన్ 15, (విజయక్రాంతి): ఎజెండాగా పని చేయాలని, ఇక్కడ లబ్దిదారుడుది ఏ పార్టీ, ఏ జెండా అనేది చూడొద్దు అని సూచించారు. గ్రామ స్థాయిలో అర్హులైన వారిని కాదని ఎంపిక చేసినా, వారి వద్ద ఎలాంటి డబ్బులు వసూళ్ల కు పాల్పడినట్టు తేలితే, సొంత పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అని కూడా చూడనని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

లబ్దిదారులకు అన్యాయం జరిగితే నేరుగా తనను కలిసి, దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లులో భాగంగా చింతలబయ్యారం ప్రముఖ శైవ క్షేత్రంలో పుష్కర ఘాట్ ఏర్పాటు కు అనుమతులు వచ్చాయని, కార్యక్రమానికి మంత్రులు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్ లో ఆదేశించారు. 

సీతంపేటలో రూ 16 లక్షలు తో సీసీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన 

మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీలో రూ 16 లక్షలు వెచ్చించ్చి ఎస్ సీ, బీసీ కాలనీల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంఖు స్థాపన చేశారు. గ్రామంలో పెండింగ్ ఉన్న రోడ్లు త్వరలో పూర్తి చేస్తామన్నారు.

అనంతరం రూ 2.5 లక్షలతో రికన్స్ట్రక్షన్ చేసిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పోటు సంకీర్త్, ఎంపీవో  శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు గొడిశాల రామనాధం, జి వెంకటరెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, దాట్ల రాజేష్, జి శ్రీనివాస రెడ్డి, కంది విజయ్ భరత్, అచ్చ నవీన్, కే సాయికుమార్  తదితరులు పాల్గొన్నారు.