21-09-2025 09:09:33 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్లె పల్లెలో వాడ వాడలా బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నారు. ఈ నేపథ్యంతో ఇవాళ మహాలయ అమావాస్య సందర్భంగా హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొననున్నారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్పూర్పిని చాటేలా బతుకమ్మ ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.