calender_icon.png 21 September, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో నీటిని ఖాళీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

21-09-2025 09:12:03 AM

నాగారం: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ముల్కల చెరువునుండి కొందరు వ్యక్తులు అక్రమంగా మోటార్ల ద్వారా చెరువులో నీటిని ఖాళీ చేస్తున్నారని శనివారం వర్ధమానుకోట గ్రామస్తులు  , ముదిరాజ్ సంఘం నాయకులు తహసిల్దార్ హరి కిషోర్ శర్మ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ముల్కల చెరువులో మోటార్ల ద్వారా నీటిని తరలించడం వలన యాసంగి సీజన్ లో పశువులకు,చెరువు కింద ఉన్న రైతులకు నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారని మోటార్ల ద్వారా నీటిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.