22 July, 2026 | 10:44 PM

మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కన్నుమూత

29-06-2024 01:24 PM

హైదరాబాద్: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కన్నుమూశారు. రమేష్ రాథోడ్ శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని అంబులెన్స్ లో ఉట్నూరుకు తరలించారు.

రమేష్ ను పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్ చేయడంతో లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పి బీజేపీలో చేరారు. 2009లో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి ఎంపీ అయ్యారు. 2018లో ఖానాపూర్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నర్నూర్ జడ్పీటీసీ, ఖానాపూర్ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. రమేష్ మృతి పట్ల పలువురు జిల్లా నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.