calender_icon.png 1 January, 2026 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్ఐ చర్చిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

01-01-2026 04:37:01 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ లో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జ్ రేవ్. పి. వీణా వసంతకుమార్ దైవ సందేశాన్ని అందించారు. ముఖ్యంగా పాతవి గతించి సమస్తము నూతనమాయెను అనే వాక్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో అలవరచుకున్న లోపాలను, తప్పిదాలను, సవరణ చేసుకొని కొత్త పంథతో, క్రొత్త ఒడంబడికతో ముందుకు కొనసాగాలని పాత జీవితానికి స్వస్తి పలకాలని వాక్యోపదేశం చేశారు. అనంతరం నూతన సంవత్సర కేక్ కమిటీ మెంబర్ లతో కలిసి కట్ చేసుకుని నోరు తీపి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నూతన సంవత్సర వాగ్దాన ప్రతులను సంఘ సభ్యులు స్వీకరించడం జరిగింది. పాస్టరేట్ ఆఫీసర్స్ బెని, కమిటీ మెంబర్ దేవయ్య, సభ్యులు స్వామి, ప్రవీణ్, వుమెన్ సెక్రెటరీ కిరన్మాయమ్మ, స్టువర్డ్ జాని, డేవిడ్, మహిళలు, యువకులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.