calender_icon.png 1 January, 2026 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వాటాలపై ప్రజెంటేషన్

01-01-2026 04:11:22 PM

హైదరాబాద్: నీటి పారుదలశాఖపై ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Minister Uttam Power Point Presentation) ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొనున్నారు. కృష్ణా, గోదావరి జలాలు, ప్రాజెక్టులపై రేపు అసెంబ్లీలో చర్చ జరగనుంది. నీటివాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ప్రజెంటేష్ ఏర్పాటు చేశారు. నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఇతర పథకాలపై వివరించనున్నారు.