calender_icon.png 1 January, 2026 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నింటిన న్యూ ఇయర్ సంబురాలు

01-01-2026 04:27:36 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): న్యూ ఇయర్ వేడుకలు వాడవాడలా ఆనందోత్సవాలమధ్యమిన్నంటాయి. నృత్యాలతో కేకులు కట్ చేసి న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. న్యూ ఇయర్ సంబరాల కేరింతలు, విందులు, నృత్యాలతో యువత రెచ్చిపోయారు. బాణాసంచాలు పటాసులు కాల్చి కొత్త సంవత్సరం వేడుకలల్లో యువతీ యువకులు మునిగిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు బెల్లంపల్లి పట్టణంలో అంబరాన్నoటాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో గురువారం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం సంబరాల్లో పాల్గొన్నారు. బెల్లంపల్లి బీసీ బాలుర ఆశ్రమా పాఠశాలలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నారు. ఆయన కేక్ కట్ చేసి విద్యార్థులతో న్యూ ఇయర్ సంబరాల్లో పాల్గొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో గడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలు ముగిసే వరకు ప్రధాన కూడాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రాత్రంతా పోలీసుల పెట్రోలింగ్ ను ముమ్మరం చేశారు. పోలీసుల పటిష్టమైన భద్రత చర్యల వల్ల న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ చూసినా యువకులు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం కనిపించింది. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్తూ యువతులు వాకిళ్లలో ముగ్గులు వేశారు.