29 July, 2026 | 12:49 AM

కలెక్టరేట్ ఎదుట ఉపసర్పంచుల నిరసన

29-07-2026 12:00 AM

ఆదిలాబాద్, జూలై 28 (విజయక్రాంతి) : సర్పంచులకు సమానంగా ఉప సర్పంచులకు సైతం ప్రాధాన్యత తో పాటు సమాన హక్కులు కల్పించాలని ఉప సర్పంచుల సంఘం ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం ఉప సర్పంచ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు గౌరవవేతనం ఇవ్వాలని, మహిళా సర్పంచులు ఉన్నచోట పురుషాధిపత్యం లేకుండా చూడాలని కోరారు.