29 July, 2026 | 1:04 AM

తెలంగాణ రక్షణ సేన ఇంచార్జిగా వేణుమాధవ్

29-07-2026 12:00 AM

జహీరాబాద్, జూలై 28: తెలంగాణ రక్షణ సేన జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా నెమలికొండ వేణుమాధవ్ ను నియమించారు. ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం చేసేందుకు వేణుమాధవ్ ను నియమించారు. మంగళవారం జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేణుమాధవ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ జెండా ఎగరవేసి పార్టీ బలోపేతం చేస్తామన్నారు.  రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి మండలంలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను నిలబెడతామన్నారు. జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను ఖరారు చేస్తామని అందుకు కసరత్తు ఇప్పటినుండి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, ముడంపల్లి, న్యాల్కల్ మండలాల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.