ఏసీబీకి చిక్కిన చర్ల డిప్యూటీ తహశీల్దార్
23-05-2024 03:19 PM
చర్ల: రాష్ట్రంలో అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబుడుతన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో డిప్యూటీ తహశీల్దార్ భరణి బాబు ఏసీబీకి చిక్కాడు. తహశీల్దారు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పాసుపుస్తకం ఇచ్చేందుకు భరణిబాబు రైతును లంచం అడిగాడు.






