6 August, 2026 | 3:07 AM

నాలాల్లో పూడికతీత పనులు చేపట్టాలి

06-08-2026 01:28 AM

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

రంగారెడ్డి,ఆగస్టు5 (విజయక్రాంతి) ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద నీరు ఇండ్లలోకి చేరకుండా బాక్స్ డ్రైన్లు, నాలాల్లో పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని న్యూ పద్మానగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించి, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి చేరిన తీరును పరిశీలించారు.

బాక్స్ డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక, నిర్మాణ వ్యర్థాలు తొలగించకపోవడం వల్లే నీరు పొంగిపొర్లుతోందని స్థానికులు తెలుపగా, ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చెత్తాచెదారాన్ని తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాజిరెడ్డి, కృష్ణమాచారి, శ్రీనాథ్, సదానంద రెడ్డి, రవి, ఉమామహేశ్వర్, శివ, జగదీష్, సురేందర్ రెడ్డి, వసంత, తదితరులు పాల్గొన్నారు.