20 May, 2026 | 1:52 PM

కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు

20-05-2026 12:52 PM

పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ఎల్లయ్య చెరువులో కొనసాగుతున్న ప్రధాన కాలువల పూడికతీత పనులను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. నీటి నిల్వల్ని పెంచడానికి ముఖ్యంగా రైతులు వ్యవసాయ దిగుబడి పొందడానికి ఈ పూడిక మట్టిని ఉపయోగించు కోవాలని నాయకులు తెలిపారు.

అదేవిధంగా గృహ నిర్మాణం చేపట్టేవారు కాలి ఉన్న ప్రదేశాలు ఉన్నా వారు ఈ పూడిక మట్టిని జేసీబీ,ట్రాక్టర్లు సహాయంతో చెరువులోని మట్టిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ గౌస్, కౌన్సిలర్ కాలేక్, రోహిత్ మున్సిపల్ సిబ్బంది సతీష్ తదితరులున్నారు.