20 May, 2026 | 1:49 PM

ధాన్యం బస్తాలతో రైతులు ఆందోళన

20-05-2026 12:49 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. వరి దాన్యం కొనుగోలు చేయాలంటూ నెన్నెల మండలం గొల్లపల్లిలో ధాన్యం బస్తాలతో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. నెలరోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు తెగబడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అధికారులను హెచ్చరించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని రైతులు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు లో అధికారులు నిర్లక్ష్యం పై రైతులు మండిపడ్డారు.