calender_icon.png 6 May, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివుడి విగ్రహం ధ్వంసం

23-04-2025 01:31:06 AM

- * జిన్నారంలో ఘటన 

- *మదర్సా ఎదుట హిందూ సంఘాల భారీ ధర్నా, నిరసన 

- పటాన్ చెరు, ఏప్రిల్ 22 : జిన్నారం శివాలయం సమీపంలోని శివుడి మట్టి విగ్రహాన్ని కొంతమంది మదర్సా ముస్లిం విద్యార్థులు ధ్వంసం చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన గ్రామస్తులు ముస్లిం విద్యార్థులను అడ్డుకొని ప్రశ్నించగా వారు జిన్నారం లోని మదర్సలోకి పరుగెత్తారు.

దీంతో జిన్నారం గ్రామస్తులు, యువకులు, హిందూ సంఘాలు భారీ ఎత్తున మదర్సా వద్దకు చేరుకొని ఆందోళన  చేపట్టాయి. శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాదుల తయారీకి కేంద్రంగా మారిన మదర్సాను తక్షణమే జిన్నారం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మదర్సను తరలించే వరకు నిరసన కార్యక్రమాలు ఆగవని తెలిపారు. శివుడి మట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన మదర్సా ముస్లిం విద్యార్థులతో పాటు, ఇందుకు సహకరించిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జిన్నారం, బొల్లారం సీఐ లు నయీముద్దీన్, రవీందర్ రెడ్డి, జిన్నారం ఎస్త్స్ర నాగలక్ష్మి సిబ్బందితో మదర్స వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు.