calender_icon.png 16 May, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం

23-04-2025 01:32:29 AM

సూర్యాపేట ఏప్రిల్ 22: అమరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై  అలుపెరుగని పోరాటాలు మరెన్నో చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మార్క్సిస్టు మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి, సీపీఐ(ఎం.ఎల్) 56 వ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రం లోని కామ్రేడ్ విక్రమ్ భవన్ లో  పార్టీ జెండా ఆవిష్కరించి, లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కామ్రే డ్ లెనిన్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసు కొని పోవడానికి 1969 లో అమాయక గిరిజనుల చావుకు కారణమైన నయా రివిజనిస్ట్ పార్టీని వ్యతిరేకిస్తూ నక్సల్ బరి ప్రాంతంలో కామ్రేడ్ చారుమజుందార్, కానుసైన్యాల్  తదితర వామపక్ష మేధావులు1969 ఏప్రిల్ 22 న సిపిఐ (ఎం.ఎల్) పార్టీ ఏర్పాటు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు  నెరవేరే వరకు వారి హక్కులకై పోరాడుతామని, ప్రజలకు అండగా ఉండేలా చేస్తామన్నారు.