శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం ఈవోగా దేవనాథం
అమీన్ పూర్, జూన్ 19 : శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం ఈఓగా విధులు నిర్వహించిన శశిధర్ గుప్త బదిలీ కావడంతో, ఆయన స్థానంలో పలుగు పోశమ్మ దేవస్థానం ఈఓ దేవనాధం నూతన ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆ ధ్వర్యంలో ఈఓ శశిధర్ గుప్తను ఘనంగా సన్మానించారు. ఆయన పదవీకాలంలో ఆలయ అభివృద్ధికి చేసిన విశేష కృషిని కమిటీ సభ్యులు కొనియాడుతూ, శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నూతన ఈఓగా బాధ్యతలు స్వీకరించిన దేవనాధంకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి, శాలువా కప్పి సత్కరించారు. ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేసి, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాం క్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ఈఓ శశిధర్ గుప్త తన పదవీకాలంలో ఆలయ అభివృద్ధికి విశేష సేవలు అందించి మంచి గుర్తింపు తె చ్చారని ప్రశంసించారు.
అలాగే నూతన ఈఓ దేవనాథం నాయకత్వంలో కూడా ఆలయం మరింత అభివృద్ధి చెందడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






