3 September, 2026 | 5:21 AM

అనుకున్న తేదీకే..

03-09-2026 | 02:35am

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’ ఘన విజయం తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్ విడుదలపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో(Social Media) పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చి ఈ ప్రచారానికి చెక్ పెట్టారు.

ముందుగా ప్రకటించిన ప్రకారం 2026, అక్టోబర్ 15వ తేదీనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మరోమారు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను పంచుకున్నారు. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావడంతో రజనీకాంత్ అభిమానుల్లో సందడి మొదలైంది.

దసరా సీజన్‌కు దగ్గరగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.