7 July, 2026 | 2:56 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

26-06-2025 12:24 AM

ఎమ్మెల్యే పాయం 

బూర్గంపాడు,జూన్25(విజయక్రాంతి):అభివృద్ధి,సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బు ధవారం మండలంలోని మోతే పట్టి నగర్,ఇరవెండి గ్రామాల్లో నూతనంగా రూ 1. 43 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు,సిసి రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం అన్నారు.అనంతరం, ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగింది.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శిరీష,ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి,మండల కాంగ్రెస్ నాయకులు ఇంగువ రమేష్, భజన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.