19 June, 2026 | 3:16 AM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం

19-06-2026 01:45 AM

ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని తెలిపారు. గురువారం అంబర్‌పేట నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వీహెచ్ శంకుస్థాపనలు చేశారు. బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ఓపెన్ నాల రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ఆలీకేఫ్ ఫంక్షన్ హాల్‌లో 200 వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంబర్‌పేట వెల్ఫేర్ సొసైటీకి జీహెచ్‌ఎంసీ నుంచి 900 గజాల భూమిని కేటాయించడంతో ఆ స్థలాన్ని సందర్శించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు  నారాయణస్వామి, గరిగంటి రమేష్, దిడ్డి రాంబాబు, రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్‌గౌడ్, పార్టీ నాయకులు లక్ష్మిపతి, పంజాల గిరిధర్‌గౌడ్, ప్రదీప్‌గౌడ్, హేమంత్‌కుమార్, సయ్యద్ ఇబ్రహీం, దేవేందర్, కోటం అనిల్, రావులు సుధాకర్, విజితారెడ్డి పాల్గొన్నారు.