19 June, 2026 | 3:25 AM

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా

19-06-2026 01:45 AM
  1. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి 
  2. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హజరు

కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రియపేర్కొన్నారు. షబ్బీర్ అలీపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణా కమిటీ వీరికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గురువారం క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.  పలు ఆధారాలను సమర్పించారు.

కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి పని చేస్తానని, పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని వివ రించారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై గడ్డం ప్రియా ఎస్పీకి ఫిర్యాదు చేయడం 8 మందిని అరెస్టు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో విబేధాలు రచ్చకెక్కినట్లయ్యింది. వీటిని సరిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగింది.