calender_icon.png 6 May, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రారంభం..

06-05-2025 05:56:57 PM

ఎమ్మెల్యే వినోద్ సుడిగాలి పర్యటన...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా మంగళవారం కన్నెపల్లి మండలంలోని పలు గ్రామాల బీటీ రోడ్లు, పలు అభివృద్ధి సంక్షేమ పనులను ప్రారంభించారు. కన్నెపల్లి మండలం సూర్జాపూర్ గ్రామపంచాయతీ రూ. కోటి 20 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. జన్కపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలో రూ .కోటి 60 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎల్లారం గ్రామ ప్రజలతో కలిసి సన్న బియ్యం సహపంక్తి భోజనం చేశారు. 

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కన్నెపల్లి, భీమిని మండలాలకి సంబంధించిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.20 లక్షల 2,320 అందించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి మండల మాజీ  జెడ్పిటీసీ సత్తన్న  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, రెవెన్యూ, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.