06-05-2025 06:09:33 PM
ఇల్లెందు (విజయక్రాంతి): అక్రమ చొరబాటుదారులను గుర్తించి వెంటనే బయటికి పంపించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశంతో మంగళవారం ఇల్లందు పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, అక్రమ చొరబాటుదారులు ఉన్నారా, అని పరిశీలించి వారిని తిప్పి పంపాలని కేంద్రం ఆదేశించినందున అట్టి కార్యక్రమాన్ని చేపట్టలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఇల్లందు పట్టణ అధ్యక్షురాలు సుచిత్ర పాసి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మావునూరి మాధవ్, శాసనాల రామయ్య, జిల్లా అధికార ప్రతినిధి దోమల మహేశ్వర్, మహిళా మోర్చ నాయకురాలు పెద్దబోయిన సునీత, జార్పుల రాం చందర్, ,శివకుమార్ ఖండేల్ వాల్, రేవల్ల నాగరాజు, సూర్యవంశి శుక్లాల్, రాజ్ కుమార్ పాసి, నరసింహారెడ్డి, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.