06-05-2025 05:49:39 PM
టేకులపల్లి (విజయక్రాంతి): మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనీ కోరుతూ సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం సులానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మంగళవారం వినతిపత్రం అందజేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నదని కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని దానికి అందులో భాగంగా 4 లేబర్ కోడ్ లను తెచ్చిందని దానికి వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పీహెచ్సీ డాక్టర్ కి సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ నబి, వీరన్న, వజ్జ సుశీల, సుగుణ, చంద్రకళ, మజహరి, విజయ, హైమావతి, తాళ్లూరి కృష్ణ, రమణ, విజయ, మల్లీశ్వరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.