15-11-2025 02:00:41 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజ యం కార్యకర్తల గెలుపుతో పాటు బీసీలు, ప్రజాపాలన విజయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, హామీలను అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్మలేదన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేతలు సునీతారావు, లక్ష్మణ్ యాదవ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, సత్యనారాయణరెడ్డితో కలిసి మీడియాతో మాట్లా డారు.
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, సన్న బియ్యం పంపిణీకి ప్రజ ల్లో మంచి స్పందన ఉందన్నారు. భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకు లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్‌లో పనిచేశారని ఆయన తెలిపారు. తాను నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు సానుకూలంగా ఉన్నారనే విషయం అప్పుడే అర్థ మైందని చెప్పారు.