15-11-2025 02:02:16 AM
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెఫరెండంగా తీసుకుంటావా? అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి కెప్టెన్‌గా ఉండి సక్సెస్ అయ్యారని, తామందరినీ ఒక నాయకుడిగా నడిపించారని తెలిపారు.
యువ కుడైన నవీన్ యాదవ్‌ను అక్కడి ప్రజలు గెలిపించారని, దీన్ని గొప్ప అవకాశంగా తీసుకుని జూబ్లీహిల్స్ ప్ర జలకు సేవ చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విజయంతోనే సంతోషపడకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తామందరం కష్టపడి పని చేయాల్సి ఉంటుందన్నారు. కాం గ్రెస్ పార్టీ తెలంగాణలో పోల్ మేనేజ్‌మెంట్ చేసినట్లుగానే దేశ వ్యాప్తంగా చేయాల్సి ఉందన్నారు.