8 June, 2026 | 7:52 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

12-10-2024 01:43 AM

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని, అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యేగా తనకు అందరు ఒక్కటేనని, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని రాకేశ్‌రెడ్డి అన్నారు.

చెక్కుల పంపిణీ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమను ఫంక్షన్‌హాల్‌లోకి అనుమతించడం లేదని బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీజేపీ వారిని అనుమతించాలని, లేదంటే ఇద్దరినీ బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు.

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే తన వద్ద గన్ ఉన్నదని, ఆ విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలని పోలీసు అధికారులకు తెలిపారు. అనంతరం పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను ఫంక్షన్‌హాల్‌లోకి అనుమతించారు. కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య పాల్గొన్నారు.