08-01-2026 02:40:07 PM
విజయ క్రాంతి నూతన సంవత్సర దిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: నిజాన్ని నిర్భయంగా చెబుతూ స్వల్ప కాలంలోనే ప్రజల పక్షాన నిలబడి అత్యంత జనాదరణ పొందుతూ విజయ్ క్రాంతి దినపత్రిక ముందుకు సాగుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలో విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్రిక యజమానియానికి, పత్రిక జర్నలిస్టులకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వంశీ చారి, అల్వాల్ రెడ్డి, విజయ క్రాంతి దినపత్రిక బ్యూరో ఇంచార్జ్ జిల్లెల, జర్నలిస్ట్ మహేష్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.