13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

లక్ష మెజార్టీ తగ్గించాను ఓడించడం పక్కా

27-03-2026 12:38 AM

సమయం వస్తే సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేస్తారు 

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం 

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ 

సిద్దిపేట, మార్చి 26 (విజయక్రాంతి): సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఉన్న ఇమేజ్ లక్ష ఓట్ల మెజార్టీని తగ్గించిన ఘనత కాంగ్రెస్ కు దక్కిందని, రానున్న ఎన్నికల్లో హరీష్ రావును ప క్కాగా ఓడిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమామ్ సవాల్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని సిద్దిపేట నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ బిఆర్‌ఎస్ నేతలు కోరుకోవడం స్వాగతిస్తున్నామన్నారు.

సమయం వచ్చినప్పుడు కచ్చితంగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు పార్టీకి అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని అం దుకు ప్రజలు మరో 10 సంవత్సరాలు అధికారాన్ని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ వారసత్వ రాజకీయానికి స్వస్తి పలికేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో మార్పు అవసరమని ప్రజలు గుర్తించారని బిఆర్‌ఎస్ నాయకులకు కాలం చెల్లితుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యాదరి మధు, గ యాసుద్దీన్, హర్షద్, విజయ్, డానియల్, బాబా, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.