13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

స్త్రీ, శిశు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

27-03-2026 12:36 AM

సంక్షేమ శాఖ అధికారి లలిత 

జహీరాబాద్, మార్చి 26 : స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితా కుమారి అన్నారు. గురువారం ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సమావేశ మందిరంలో నూతనంగా గెలుపొందిన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా లలితా కుమారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉండే పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం సమయానుకూలంగా అందించడమే ఐసిడిఎస్ కృషి చేస్తుందన్నారు. పోష్ యాక్ట్ పకడ్బందీగా అమలుచేందుకు అందరు సహకరించాలని ఆమె సూచించారు.

ఈ యాక్ట్ ద్వారా మహిళలకు, శిశువులకు సరైన రక్షణ లభిస్తుందని ఆమె వివరించారు. జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం, శిశువు అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ఈ యా క్టును ఐసిడిఎస్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పోష్ యాక్ట్ ద్వారా ఉద్యోగ స్థలాల్లో మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యమని, ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చే యాలని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఈ కమిటీ ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త పల్లవి, ఎంపీడీవో మంజుల, సూపర్వైజర్ రాధా, మహిళా ఉద్యో గులు తదితరులు పాల్గొన్నారు.