calender_icon.png 2 May, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధి

02-05-2025 12:00:00 AM

సాయి ప్రసాద్ గౌడ్

వారసిగూడ, మే 1 (విజయక్రాంతి) : బీజేపీ బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన డివిజన్ లోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది ఈ సమావేశంలో మే 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోయే అంబర్‌పేట ఫ్లైఓవర్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయలతో రహదారులు, ఫ్లైఓవర్లు, వంతెనలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు ప్రారంభిస్తారని, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గౌడ్ తెలిపారు.

అంబర్‌పేట్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బౌద్ధ నగర్ డివిజన్ నుంచి పోలింగ్ బూత్ వారీగా అధిక సంఖ్యలో పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమంను విజయవంతం చేయవల్సిందిగా జిల్లా అధికార ప్రతినిధి ప్రభు గుప్త తెలిపారు.

ఈ సమావేశంలో నాయకులు నేతి సత్యనారాయణ, దత్తు, వీ.ఎస్. రాజు, రఘు, సంపత్, చైతన్య, కుమార్, ఓములు, సుధాకర్, నవీన్, డి.రాజు, పాండు, నాగమణి, సురేష్, బట్టల శీను, సతీష్ నేత, స్టవ్ సత్తి, ఆర్.నర్సింగ్, నీలేష్, శ్రీశైలం, నాగరాజు, ప్రమోద్, అశోక్, శ్యామ్ రాజ్, వెంకటేష్ యాదవ్, బిక్షపతి, బాలయ్య, వెంకీ, రూప్ సాయి, గజరాజుపాల్, వీ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.