calender_icon.png 3 May, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం

02-05-2025 04:20:36 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని హర్షిస్తూ  భారతీయ జనతా పార్టీ మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అమిరి శెట్టి రాజు కుమార్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొడ్డున మల్లేష్, మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేష్ గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్త కులగణన పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. దీని వల్ల రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాల వారికి సామాజిక న్యాయం కోణంలో కలుగుతాయన్నారు. రాబోయే రోజుల్లో మోదీ ప్రభుత్వం మరిన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, మంచిర్యాల అసెంబ్లీ కన్వీనర్ తోట మల్లిఖార్జున్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిలు బోయిని హరికృష్ణ, రెడ్డి మల్ల అశోక్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న, ఎస్సి మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న, బెల్లంకొండ మురళీ, పూదరి రాంచందర్, బీ జే వై ఎం పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మేరెడీ కొండ శ్రీనివాస్, తరుణ్ సింగ్, రవీందర్ యాదవ్, పవన్ కుమార్, అనిల్ కుమార్ బిజెపి కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.