02-05-2025 04:07:15 PM
జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం
హుజురాబాద్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనంగా తరుగు కట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోనిజమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించినారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కిలో కన్నా ఎక్కువ తరుగు తీస్తున్నారని మా దృష్టికి వచ్చిందని అన్నారు.
రైతులు బస్తాకు తరుగు పేరిట రెండు కిలోల ధాన్యం కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయగా, చైర్ పర్సన్ వెంటనే ఏపీఎంతో మాట్లాడి కేవలం ఒక కిలో మాత్రమే తరుగు వర్తింపజేయాలని ఆదేశించారు. అదనంగా తరుగు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హమాలీల కోసం తగిన శుద్ధి నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించడం లేదన్న ఫిర్యాదులపై స్పందించి, వాటిని తక్షణమే అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, కాంగ్రెస్ నాయకులు, యువజన నేతలు, రైతులు, హమాలీలుపాల్గొన్నారు.