calender_icon.png 3 May, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరావతికి చేరుకున్న ప్రధాని మోదీ

02-05-2025 03:55:42 PM

అమరావతి,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లోని వెలగపూడి వేదికగా  అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని(Amaravati Reconstruction Program) ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్వహిస్తుంది. ఈ వేడకకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) హెలికాప్టర్ ద్వారా వెలగపూడి చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్(AP Governor Abdul Nazeer), ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP Chief Minister Nara Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) ఘన స్వాగతం పలికి హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి వెళ్తున్నారు. సభావేదిక పైనుంచే ఆంధ్రప్రదేశ్ రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటు మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రాజధాని పునఃప్రారంభానికి వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను సమకూర్చింది. ఏపీ రాజధాని స్వప్నం సాకారమవుతుందన్న ఆనందంలో ప్రజలు అన్ని జిల్లాల నుంచి అమరావతికి భారీ తరలివచ్చారు.