02-05-2025 04:12:53 PM
ఎంపికపై సాతుపాటి జమలయ్యకు అభినందనలు..!
వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండల పరిధిలోని చిన్న మునగాల గ్రామవాసి వ్యవసాయ కుటుంబానికి చెందిన సాతుపాటి జమలయ్య స్పెషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గైడ్ ప్రొఫెసర్ కే మంజుల వాణి ఆధ్వర్యంలో డిపి లెర్నింగ్ మోడల్ ఫర్ క్రాఫ్ ఐడెంటిఫికేషన్ ఫర్ హైపర్ స్పెక్టార్ డేటా ద్వారా పంటలు గుర్తింపు పరిశోధనలకు గాను డాక్టరేట్ కు జమలయ్య ఎంపికయ్యారు.
జమలయ్య తల్లిదండ్రులు వెంకయ్య, స్వరాజ్యంలు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. వారు కష్టపడి చదివి ఉన్నతంగా తీర్చిదిద్దారు. జమలయ్య ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు చిన్న మునగాల యుపిఎస్ లో,8 వ తరగతి పెద్ద మునగాల జడ్పీఎస్ఎస్ లో 9, 10 తరగతులు వైరాలోని మధు విద్యాలయం, ఇంటర్ మధు జూనియర్ కళాశాలలో ఇంజనీరింగ్ వజీర్ సుల్తాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో విద్యను అభ్యసించారు.
అంతేకాక జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం లో విద్యను పూర్తి చేశారు.. సాంకేతిక విద్య పట్ల ఎంతో మక్కువతో ముందుండే జమలయ్య డాక్టరేట్ పట్టా అందుకోవటం పట్ల చిన్న మునగాల గ్రామస్తులతోపాటు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ప్రజాప్రతినిధులు విద్యాధికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.