02-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మే 1 (విజయక్రాంతి) : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ముషీరాబాద్ లో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే జెండాను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడే తమ న్యాయమైన హ క్కులను సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, రాష్ట్ర నాయ కుడు రహీం, డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.