01-05-2025 11:00:58 PM
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్..
రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్ లైన్..
బుక్స్ వెబ్ సైట్ ప్రారంభం..
ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తికాగానే జాబ్ క్యాలెండర్ పరుగులు పెడుతుందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. గురువారం దిల్ షుఖ్ నగర్ లోని రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్ లైన్ బుక్స్ వెబ్ సైట్ ను రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ... ఉద్యోగాల కల్పన అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు అని, భవిష్యత్తు నిర్మాణంగా ప్రభుత్వం భావిస్తుందన్నారు.
ఎస్సీ వర్గీకరణ, చిన్నచిన్న టెక్నికల్ ఇష్యూలను దాటి జాబ్ క్యాలెండర్ త్వరలో రాబోతుందని, జూన్ రెండో తేదీన ప్రభుత్వం తీపికబురు అందించబోతుందన్నారు. విద్యార్థులు అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగులకు అవసరమయ్యే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉన్నాయని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కోరుకునే పుస్తకాలు పుస్తక రూపంలో ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఘర్ ఘర్, గల్లి గల్లి, గావ్ గావ్ రీతిలో రామయ్య బుక్స్ ఆన్ లైన్లో గ్రూప్స్, పోలీస్, టెట్, డీఎస్సీ పరీక్షకు సంబంధించిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచారని తెలిపారు. ప్రతి గ్రామం, వాడ మారుమూల ప్రాంతంలో రామయ్య కోచింగ్ సెంటర్ ఆన్ లైన్ బుక్స్ ను వెబ్ సైట్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నిరుద్యోగులు వెెబ్ సైట్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.