calender_icon.png 3 May, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బసవేశ్వర జయంతి

02-05-2025 04:23:48 PM

బైంసా,(విజయక్రాంతి): భైంసాలో వీరశైవ లింగాయత్ ముధోల్ శాఖ ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.  వీర శైవ లింగాయత్ సంఘ భవనంలో బసవేశ్వర చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన సంకీర్తన కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం పట్టణంలో  సంఘ భవనం నుండి గాంధీ గంజ్ వరకు నిర్వహించిన శోభాయాత్రలో పెద్ద ఎత్తున వీర లింగ సోదరులు పాల్గొని నృత్యాలు చేస్తూ భజన పాటలు పాడుతూ వేడుకలను నిర్వహించారు.

ఈ వేడుకలకు ధర్మాబాద్ బాలాపూర్ అంగీరియా కు చెందిన మహారాజులు లక్ష్మణ్ దత్తు పటేల్ తదితరులు  ప్రవాచనాలను బోధించారు. ఈ కార్యక్రమంలో  సంఘ నాయకులు కామన్న అప్పటేల్, మారుతి పటేల్ నాగభూషణం పాండురంగ నారాయణ పటేల్ గంగాధర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.