11 August, 2026 | 1:52 AM

నూతన దేవాలయ అభివృద్ధి

11-08-2026 12:15 AM

కమిటీని సన్మానించిన సర్పంచ్

మల్లాపూర్, ఆగస్టు 10, (విజయక్రాంతి ): మల్లాపూర్ మండల కేంద్రం లోని దేవాలయాల అభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గంగ నర్సయ్యలను మల్లాపూర్ మేజర్ గ్రామ పం చాయతీ సర్పంచ్ ఘనంగా సన్మానించారు.

శాలువాలతో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భం గా సర్పంచ్ మాట్లాడుతూ మల్లాపూర్లోని కనకసోమేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గ్రామంలోని అన్ని దేవా లయాలను అభివృద్ధి చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, ప్రముఖులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, మాజీ దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సంఘ గంగారాజం, ప్రముఖులు, గ్రామ ప్రజలు, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.