ఆరుతడి పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత నివ్వాలి
జెడ్పీసీఈఓ శిరీష
కోదాడ (నడిగూడెం)ఆగస్టు 10 : ఎల్ నినో ప్రభావంతో వర్షాబావ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఆరుతడి పంటలు సాగు చేయాలని జడ్పీ సీఈవో శిరీష కోరారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో రైతులతో మాట- పంట మార్పిడికి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగర్ కాలువ ద్వారా సాగు నీరు వచ్చే పరిస్థితి లేనందున వరి పంటను సాగు చేసి రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం రైతులకు పంట సాగుపై అవగాహన కల్పిస్తుంది అన్నారు.
రైతులు వరికి బదు లుగా ఇతర ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలైన మినుములు, బొబ్బర్లు ఉలువలు, కూరగాయ పంటలను సాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ, మండల ప్రత్యేక అధికారి దామోదర్ రెడ్డి,ఎంపీడీవో మల్సూర్ నాయక్,సర్పంచ్ దున్నా శ్రీనివాస్,ఏఈఓ వెంకటరెడ్డి, జిపిఓ కోటయ్య, రైతులు పందిరి వెంకటరెడ్డి, వేపూరి సుదీర్ కుమార్, కాసాని వెంకన్న,ఎలకా రామిరెడ్డి,దేవరంగుల నాగభూషణం,ఎలకా సంజీవరెడ్డి,బోళ్ళ సీతారామరెడ్డి,శ్రీరాముల శ్రీనివాస్,మల్లికంటి శ్రీహరి,కాటేబోయిన సోమయ్య,గుండు రమేష్, మేకల శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.






