23-08-2025 01:00:24 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారం భించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పంచాయితీ కార్యాలయా ల భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామాలలో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగం గా గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని 20 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపా రు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేవలు అందించిందని తెలిపా రు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తరావు, పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, పంచాయితీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ, డివి జనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసిల్దారు రియాజ్ అలీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి మౌనిక, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.