28 July, 2026 | 12:25 AM

మందుల సామేల్‌తోనే అభివృద్ధి

28-07-2026 12:10 AM
  1. తిరుమలగిరిలో దాడికి ఎమ్మెల్యేకు సంబంధం లేదు
  2. తుంగతుర్తి మండలాధ్యక్షుడు రవిగౌడ్

తుంగతుర్తి, జూలై 27: ఎమ్మెల్యే మందుల సామేల్ నాయకత్వంలోనే రూ.2 వేల కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు రేగటి రవిగౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సుమారు రూ.2 వేల కోట్ల నిధులతో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు తదితర రంగాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

తుంగతుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం గ్రూపు రాజకీయాలను సృష్టించి కార్యకర్తలను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తిరుమలగిరిలో జరిగిన వారి కుటుంబ సమస్యను, ఎమ్మెల్యేపై రుద్దడం సబబు కాదని అన్నారు. పార్టీ శ్రేణులు అలాంటి పుకార్లను నమ్మకుండా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మందుల  నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రంథాలయ చైర్మన్ గంగరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షు బికోజి, పార్టీ నాయకులు పోలేపాక రామచంద్రు పాల్గొన్నారు.