28 July, 2026 | 12:55 AM

3లోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి

28-07-2026 12:11 AM

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపు

ఇబ్రహీంపట్నం:జులై28(విజయక్రాంతి): జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి అర్హ ఓటరు ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. గడువులోగా ఫారం సమర్పించని వారి వివరాలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలనకు గురవుతాయని, అవసరమైన ప్రక్రియ అనంతరం ఓటరు జాబితాలో పేరు కొనసాగకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. చివరి రోజు వరకు వేచి ఉండకుండా వెంటనే బీఎల్వోను సంప్రదించి ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

‘ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

ప్రతి కుటుంబం తమ ఇంటిలోని అర్హులందరూ ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారో లేదో నిర్ధారించుకోవాలి. బంధువులు, స్నేహితులు, పొరుగువారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి గడువులోగా ఫారాలు సమర్పించేలా చైతన్యం కల్పించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్ర,

పారదర్శక ఓటరు జాబితా రూపొందుతుంది. ‘గుర్తుంచుకోండి.. ఎన్యూమరేషన్ ఫారం సమర్పణకు చివరి తేదీ  ఆగస్టు 3. ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత బీఎల్వోకు తప్పనిసరిగా అందజేయాలి. గడువులోగా ఫారం సమర్పించని వారి వివరాలు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పరిశీలించబడతాయి. మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే వెంటనే ఎన్యూమరేషన్ ఫారం సమర్పించండి. ‘మీ ఓటు మీ హక్కు. మీ బాధ్యత. ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కండి.అని సూచించారు.