17-02-2026 01:56:14 AM
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిరలో మున్సిపల్ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే బలంగా ఉన్నదని, పట్టణ ప్రాంతాల్లో బలహీనంగా ఉన్నదన్న కొన్ని పార్టీలు చేసిన ప్రచారానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టుగా తీర్పునిచ్చారు అని పేర్కొన్నా రు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికలతో పాటు పట్టణ ప్రాం తంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన బలాన్ని నిరూపించింది అని అన్నారు.
90 నుంచి 95 మున్సిపాలిలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలనే ఎన్నడు లేని విధంగా పట్టణ ప్రాంతాల్లో ఏ పార్టీకి రాని భారీ మెజార్టీని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు అని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం అత్యంత ప్రధానమైన అంశాలతో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులందరూ సమిష్టిగా అర్బన్ సెంటర్స్‌ను అభివృద్ధి చేసిన దానికి ఫలితంగా ప్రజలు గుర్తించి ఆదరించారు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మ కం ఉంచి ఓటు వేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి సంక్షేమం మేలు కలయికతో మరింత బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని వివరించారు. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న పట్టనీకరణను సమతుల్యతతో అభివృద్ధి చేయడానికి మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యూర్ క్యూ రేర్ విధానం తీసుకొచ్చి పట్టణాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు.
2,047 నాటికి 3 త్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. చైర్‌పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోనా ధోని, టీడీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామరావ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహరావు పాల్గొన్నారు.