కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
02-05-2024 12:43 AM
డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 1(విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధితో పాటు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి తార్నాక డివిజన్‌లోని మాణికేశ్వర్ నగర్‌లో బుధవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే దేశం ప్రగతి బాటలో పయనిస్తుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ప్రజలు దానం నాగేందర్‌ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచారంలో నాయకులు ఆదం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




