రూ.1.61 కోట్లతో అభివృద్ధి పనులు
వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, బెంచీల ఏర్పాటుకు నిధులు
నాగోల్, ఆగస్టు 19: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి, సుందరీకర ణకు రూ.1.61 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ చొరవతో ఈ ని ధులు మంజూరైనట్లు వెల్లడైంది. ఈ అం శంపై ఇటీవల వచ్చిన వార్తల్లోనూ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో మధుయాష్కి గౌడ్ సమావేశమై చెరువుల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నా రు.
నియోజకవర్గంలోని బండ్లగూడ, నాగోల్, సాహెబ్నగర్, బీఎన్రెడ్డి డివిజన్ల పరిధిలోని కాప్రాయి చెరువుతో పాటు బాతుల చెరువు, కుమ్మరి కుంటలను మధుయాష్కి గౌడ్ పరిశీలించారు. చెరువు కట్టలపై వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, బెంచీలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంజూరైన నిధులతో బండ్లగూడ చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీల కోసం రూ.41 లక్షలు, నాగోల్ చెరువు కోసం రూ.64 లక్షలు కేటాయించారు.
మన్సూరాబాద్ చిన్న చెరువు సుందరీకరణకు రూ.10 లక్షలు, సాహెబ్నగర్ కాప్రాయి చెరువు, హయత్నగర్ బాతుల చెరువు కట్టలపై వాకింగ్ ట్రాక్, లైటింగ్, బెంచీల కోసం రూ.46 లక్షలు మంజూరయ్యాయి. చెరువుల అభివృద్ధి పూర్తయితే స్థానికులకు వాకింగ్ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు చెరువు పరిసరాలు మరింత ఆహ్లాదకరంగా మారనున్నాయి.






