కుంటాల రిసారట్స్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాజర్షిషా
నేరడిగొండ, ఆగస్టు 25 : నేరడిగొండ మండలంలోని జలపాతానికి సమీపంలో రూ. 3.5 కోట్ల వ్యయంతో చేపట్టిన కుంటాల రిసారట్స్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ రిసారట్స్ ప్రాంగణంలో పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు, అదనపు సౌకర్యాలపై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
బోటింగ్ పాయింట్ వద్ద పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, భద్రతా ప్రమాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రిసార్ట్ ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. ఈ పర్యటనలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజనీర్ ఆంజనేయులు, జిల్లా టూరిజం అధికారి రవి కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి తానాజీ, డిఆర్డీఓ రవీందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






