26 August, 2026 | 3:43 AM

మొక్కల పెంపకం తోనే, మానవుని మనుగడ సాధ్యం

26-08-2026 12:00 AM

సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మల్లె పాక సాయిబాబ

తుంగతుర్తి, ఆగస్టు 25: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, సర్పంచులు కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మల్లెపాక సాయిబాబా అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం, తుంగతుర్తి వెంపటి దుర్గూడం గానుబండ కొత్తగూడెం గొట్టిపర్తి వెలుగుపల్లి దేవుని గుట్ట తండా రావులపల్లి తదితర గ్రామాల్లోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ప్రాంతాల్లోని ఇంటిలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం మూలంగా వర్షం కురవడంతో పాటు , రానున్న రోజుల్లో భావితరానికి ఆక్సిజన్ కొరత లేకుండా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు బికోజి, కొండగడుపులు ఎల్లయ్య, దాసరి రేణుక, కలకోట్ల మల్లేష్, గుగులోతు స్వాతి భాస్కర్ నాయక్, రమేష్, వివిధ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.