14-01-2026 01:10:02 AM
పంచాయతీ కార్యాలయలను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, జనవరి 13 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అబివృద్ధి దిశగాముందుకు సాగుతున్నాయని, ప్రజలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలు, అభివృద్ధిని గుర్తించి సహకరించాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మం డలంలోని శ్యాం నాయక్ తండా, తాండ్ర గ్రామాలలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల్లోని సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే త్వరతిగతిన పరిష్కరిస్తామన్నారు. వేసవి కాలంలో అవసరం ఉన్న ప్రతి చోట బోర్ లను వేస్తాం అని, అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి రెండవ విడతలో ఇందిర మ్మ ఇండ్ల మంజూరు చేస్తామని, సీసీ రోడ్స్ , డ్రైనేజీ పనులు మంజూరు చేయిస్తామన్నారు. అన్ని విధాలుగా గ్రామాల అబివృద్ధి మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.