13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సీఎం పర్యటనను అడ్డుకుంటాం

14-01-2026 01:09 AM

ట్రయల్ రన్ కోసం ముఖ్యమంత్రి రావడం హాస్యాస్పదం

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, జనవరి 13 (విజయక్రాంతి) : అన్ని వర్గాలకు మోసపూరిత హామీతో పాటు, రైతులకు రైతుబంధు ఎగగొట్టడమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ కల్పించిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న చేపట్టే ఆదిలాబాద్ పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. మంగళవారం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డికి రైతుల బాధలు పట్టవు కానీ, ఎన్నికలు రాగానే కానుకలు గుర్తుకు వస్తున్నాయన్నారు.

గడచిన రెండు సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదు, కానీ చనాక కొరట బ్యారేజ్ ట్రయల్ రన్ పేరుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేయడం రైతులు గమనిస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే రైతుబంధు వేస్తున్నారు తప్ప, రైతులకు కావాల్సిన యూరియా రైతుబంధు, కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతుందన్నారు. ఎన్నికల కోసం చనాక కోరాట ప్రాజెక్టు ట్రయల్ రన్ కోసం సీఎం రావడం హాస్యస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగరావు, గండ్రత్ రమేష్, మెట్టు ప్రహ్లాద్, సతీష్, బుట్టి శివ, తిరుపతి, పాశం రాఘవేంద్ర, మహేష్, సదుల్ల, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.