అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్
04-07-2026 07:38 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులను ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించి వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకు ముందు నస్పూర్ మండల కేంద్రంలోని ఈవీఎం గోదాం వద్ద భద్రత చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ పాట్ల భద్రతకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టామని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.






